హెచ్చరించినా.. డోంట్‌ కేర్‌! | - | Sakshi
Sakshi News home page

హెచ్చరించినా.. డోంట్‌ కేర్‌!

Published Mon, Jan 20 2025 1:26 AM | Last Updated on Mon, Jan 20 2025 1:26 AM

హెచ్చరించినా.. డోంట్‌ కేర్‌!

హెచ్చరించినా.. డోంట్‌ కేర్‌!

బాన్సువాడ : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ లేఅవుట్లు జోరుగా వెలుస్తున్నాయి. నిబంధ నలు పాటించని లేఅవుట్ల విషయంలో మున్సిపల్‌ అధికారులు హెచ్చరిస్తున్నా రియల్టర్లు పట్టించుకోవడం లేదు. బల్దియా అధికారులు వాటిలో బండరా ళ్లు తొలగించినా వీరు మాత్రం తమ తీరు మార్చు కోవడం లేదు. డోంట్‌ కేర్‌ అంటూ వ్యవహరిస్తున్నా రు. బాన్సువాడ పట్టణంలో ఏర్పాటు చేసిన అను మతి లేని లేఅవుట్‌లే ఇందుకు నిదర్శనం. బాన్సు వాడ పట్టణంలోని కల్కి చెరువు శిఖం భూమిని ఆనుకుని కొందరు రియల్టర్లు లేఅవుట్‌ను ఏర్పాటు చేశారు. అయితే రియల్టర్లు పనిలో పనిగా శిఖం భూమిలో కూడా హద్దు రాళ్లు పాతి ప్లాట్లు చేశారు. ఈ విషయంపై సాక్షి దినపత్రికలో శిఖం ఖతం అనే శీర్షిక వెలువడింది. దీంతో జిల్లా కలెక్టర్‌ సైతం ఈ వెంచర్‌పై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అప్పటి ఆర్డీవో రమేష్‌ రాథోడ్‌ను ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్‌, మున్సిపల్‌ అధికారులు సంయుక్తంగా విచారణ చేసి 5 ప్లాట్లు శిఖం భూమిలో ఉన్నట్లు గుర్తించి నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. రియల్టర్లు మాత్రం ఇదేమి పట్టనట్లు శిఖం భూమి వరకు రోడ్లు, మురికికాలువల నిర్మాణం చేపట్టారు. శిఖం భూమిలోనే 10 శాతం భూమిని బల్దియా కేటాయించేందుకు సిద్ధమవుతున్నారు. సాయికృపానగర్‌ కాలనీలో అసైన్డ్‌ భూమిలో అక్రమ లేఅవుట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. బోర్లం రోడ్డులో ప్రభుత్వ భూమిలో సైతం వెంచర్లు వెలుస్తున్నా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. బాన్సువాడతో పాటు బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌ మండలంలో అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి. నస్రుల్లాబాద్‌ మండలంలోని బస్వాయిపల్లి శివారులోని వ్యవసాయ భూమిలో ఓ రియల్టర్‌, వెంచర్‌ ఏర్పాటు చేశారు. హద్దురాళ్లు పాతి ప్లాట్లుగా చేసి విక్రయించాడు. ఈ వెంచర్‌కు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో ప్రస్తుతం ఇక్కడ ఇళ్లు నిర్మించుకునే వారు ఇబ్బందులు పడుతున్నారు. బాన్సువాడ పట్టణంలో వెలుస్తున్న కొన్ని లేఅవుట్‌లకు మున్సిపల్‌ పట్టణ ప్రణాళిక విభాగం నుంచి గాని, డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌(డీటీసీపీ) నుంచి గానీ ఎలాంటి అనుమతులు లేవు.

చర్యలు తీసుకుంటాం

బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో నిబంధనలను అతిక్రమించి అనుమతులు లేకుండా ఏర్పాటు చే స్తున్న లేఅవుట్లపై చర్యలు తీసుకుంటున్నాం. ఇ ది వరకే నోటీసులు కూడా జారీ చేశాం. ప్లా ట్లను కొనుగోలు చేసే ప్రజలు లేఅవుట్‌కు అధికారిక అనుమతులు ఉ న్నాయా..లేవా.. అనే విషయం తెలుసుకోవాలి. లేకుంటే ఇంటి నిర్మాణానికి అనుమతి లభించక ఇబ్బందులు ప డతారు.– శ్రీహరిరాజు,

మున్సిపల్‌ కమిషనర్‌, బాన్సువాడ

నిబంధనలివి..

బాన్సువాడలో నిబంధనలకు

విరుద్ధంగా లేఅవుట్లు

అధికారులు రంగంలోకి దిగినా ఖాతరు చేయని రియల్టర్లు

బండరాళ్లు తొలగించినా

మళ్లీ పాతిన వైనం

సాధారణంగా లే అవుట్‌ ఏర్పాటు చేయాలంటే మున్సిపల్‌ పట్టణ ప్రణాళిక విభాగం నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. అనంతరం లేఅవుట్‌ విస్తీర్ణంలో 15 శాతం భూమిని మున్సిపాలిటీకి మార్టిగేజ్‌ చేయాలి. ఇది పూర్తయ్యాకే లేఅవుట్‌ పనులు ప్రారంభించాలి. 40 ఫీట్ల రోడ్లతో పాటు, విద్యుత్‌, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించాలి. కానీ ఈ కొన్ని లేఅవుట్లలో అలాంటి సౌకర్యాలేమీ కనిపించడం లేదు. అనుమతులేమీ లేకుండా కేవలం మట్టి రోడ్లు వేసి ఒక్కో ప్లాటును రూ.15 లక్షల నుంచి రూ.40 లక్షలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement