● మరో నాలుగు ఆవులకు గాయాలు
● రూ.3 లక్షల ఆస్తి నష్టం
నవీపేట: మండలంలోని పొతంగల్‌లో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో రెండు ఆవులు మృతి చెందగా మరో నాలుగు ఆవులు తీవ్రంగా గాయపడ్డాయి. చిలుక సాయిబాబ అనే పాడి రైతు ఇంటి పక్కనే పశువుల పాకకు షార్ట్‌సర్క్యూట్ కారణంగా శనివారం రాత్రి మంటలు అంటుకున్నాయి. పాకలో ఉన్న రెండు ఆవులు సజీవ దహనం కాగా, మరో నాలుగు ఆవులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంలో రూ.3లక్షల నుంచి రూ.4లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది.
చెరువులో పడి
గుర్తు తెలియని వ్యక్తి..
ఖలీల్‌వాడి: నగరంలోని ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అసద్ బాబానగర్ కాలనీ శివారులోని జాలితలాబ్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై మహేశ్ ఆదివారం తెలిపారు. ప్రమాదవశాత్తు నీటిపడి మృతి చెందాడా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో విచారిస్తున్నామన్నారు. మృతుడి సమాచారం తెలిసిన వారు నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ (87126 59847), ఎస్సై (87126 59848)కి సమాచారం అందించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment