ఇరుకు గదిలో ఇబ్బందులు
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రం–2 అద్దె భవనంలో కొనసాగుతోంది. కేంద్రంలో 22 మంది చిన్నారులు ఉండటంతో ఇరుకు గది సరిపోకపోవడంతో అవస్థలు పడుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రానికి గతంలో సొంత భవనం నిర్మించారు. కానీ నాణ్యతలోపం కారణంగా భవనం పెచ్చులూడుతుంది. దీంతో సదరు భవనాన్ని వదిలేసి, అద్దె భవనంలో కేంద్రం కొనసాగిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అంగన్‌వాడీ భవనానికి మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.
పెచ్చులూడడంతో వృథాగా ఉన్న అంగన్‌వాడీ భవనం
Comments
Please login to add a commentAdd a comment