రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
మోపాల్: మండలకేంద్రం శివారులో ఆదివారం కారు, బైక్ ఢీకొన్న సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కంఠేశ్వర్‌కు చెందిన రాజేశ్, గణేశ్ మంచిప్ప నుంచి నిజామాబాద్ వైపు వెళ్తుండగా, అదేసమయంలో నిజామాబాద్‌కు చెందిన టీఎస్ 16ఎఫ్‌ఎఫ్2649 నంబర్ గల కారు మంచిప్ప వైపు వెళ్తోంది. మోపాల్ శివారులోని ఎల్లమ్మ ఆలయం వద్ద కారు అతివేగంగా ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో రాజేశ్ కాలు విరగగా, గణేశ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారులో మద్యం సీసాలు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఇదే విషయమై ఎస్సై యాదగిరిగౌడ్‌ను వివరణ కోరగా, క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment