అంబులెన్స్‌లో డెలివరీ చేసిన సిబ్బంది
ధర్మపురి: పురిటి నొప్పులతో బాధ పడుతున్న ఓ గర్భిణికి 108 సిబ్బంది అంబులెన్స్‌లోనే నార్మల్ డెలివరీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ధర్మపురికి చెందిన స్వప్నకు మంగళవారం అర్ధరాత్రి పురిటినొప్పులు మొదలయ్యాయి. కుటుంబసభ్యులు 108కు ఫో న్ చేయగా అంబులెన్స్ వచ్చింది. ఆమెను జగిత్యాల తరలిస్తుండగా నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో సిబ్బంది అనిల్‌కుమార్, ఖయ్యూంలు అంబులెన్స్‌లోనే స్వప్నకు సాధారణ ప్రసవం చేశారు. ఆమె ఆడబిడ్డకు జన్మనివ్వగా తల్లీబిడ్డ క్షేమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment