కరీంనగర్: కరీంనగర్‌కు బుధవారం రాష్ట్ర మంత్రులు ముగ్గురు రానున్నారు. జిల్లా ఇన్‌చార్జి, ఇరిగేషన్, సీఏడీ పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శాసనసభ వ్యవహారాలు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజాపాలన కార్యక్రమం రివ్యూ మీటింగ్‌కు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు నిర్వహించే సమీక్ష సమావేశానికి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు హాజరవుతారని అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ వివరించారు.
ఎల్‌పీసీ సమర్పించాల్సిందే..
● బల్దియా కమిషనర్ బోనగిరి శ్రీనివాస్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నగరపాలక సంస్థకు బదిలీపై వచ్చిన ఉద్యోగులు తప్పనిసరిగా లాస్ట్ పేమెంట్ సర్టిఫికెట్(ఎల్‌పీసీ) సమర్పించాల్సిందేనని కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. బల్దియాకు బదిలీపై వచ్చి, రెండేళ్లు గడుస్తున్నా ఎస్‌ఈ నాగమల్లేశ్వరరావు, డీఈ లచ్చిరెడ్డిలు ఎల్‌పీసీ సమర్పించకుండా, వేతనాలు పొందకుండా ఉద్యోగాల్లో కొనసాగుతున్న వైనంపై ఈ నెల 23న ‘రివర్స్ ఇంజినీరింగ్’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన కమిషనర్ ఎల్‌పీసీ సమర్పించాల్సిందేనని స్పష్టం చేశారు. వీరిరువురితోపాటు బదిలీపై వచ్చిన ఉద్యోగులు తప్పనిసరిగా అందజేయాలని ఆదేశించారు.
30న జాతీయ లోక్ అదాలత్
● డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి, జడ్జి వెంకటేశ్
కరీంనగర్‌క్రైం: ఈ నెల 30న కరీంనగర్, హుజూరాబాద్ కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ(డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి, జడ్జి వెంకటేశ్ తెలిపారు. మంగళవారం కరీంనగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజీ చేయదగిన క్రిమినల్ కేసులు 2,021, సివిల్ కేసులు 350లను గుర్తించి, సంబంధిత కక్షిదారులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. రాజీయే రాజమార్గంగా నిర్వహిస్తున్న లోక్ అదాలత్‌లలో రాజీ కుదుర్చుకుంటే ఇరువర్గాల వారికి స్నేహపూర్వక వాతావరణం ఉంటుందని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
న్యూ ఇయర్ ఈవెంట్స్‌కు అనుమతి తప్పనిసరి
● సీపీ అభిషేక్ మహంతి
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో న్యూ ఇయర్ సందర్భంగా నిర్వహించే ప్రైవేట్ ఈవెంట్స్, పార్టీలకు ముందస్తు అనుమతి తప్పనిసరని సీపీ అభిషేక్ మహంతి ఒక ప్రకటనలో తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, ప్రజాశాంతికి భంగం కలిగించినా చట్టప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాములోరి అక్షింతల శోభాయాత్ర
కరీంనగర్‌టౌన్: అయోధ్య రాములోరి అక్షింతలు, కలశాలతో మంగళవారం శోభాయాత్ర నిర్వహించారు. మేళతాళాల మధ్య కరీంనగర్‌లోని గీతామందిర్(అశోక్‌నగర్) నుంచి వారసంత, టవర్ సర్కిల్, గంజ్ వినాయకుడు, పాత బజార్ శివాలయం, మారుతీనగర్ చౌరస్తా, బొమ్మకల్ చౌరస్తా మీదుగా యజ్ఞవరాహ స్వామి క్షేత్రం వరకు తీసుకెళ్లారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు మురళీధర్, మహేశ్వర్, ప్రసాద్, శ్రీను, అవుదుర్తి శ్రీనివాస్, పోరెడ్డి శ్రీధర్, విక్రమ్, సాగర్, అనిల్, దర్శనాల కృష్ణ, సతీశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment