‘నగరంలోని ఓ కార్పొరేటర్ ఒకరోజు తన డివిజన్‌లో ఇటీవల పర్యటించాడు. ఆయా వీధుల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నాడు. సమస్యలున్నాయని చెబితే అక్కడికి వెళ్లి స్వయంగా పరిశీలిస్తున్నాడు. ఇదే సమయంలో అక్కడే తిరుగుతున్న ఓ కుక్క అకస్మాత్తుగా కార్పొరేటర్ చేతిని కరిచింది. ఇప్పుడాయన ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నాడు.’
‘నగరంలోని ఓ మూ డంతస్తుల నివాస భవ నం. ఆ ఇంట్లో ఒక్కో అంతస్తులో ఇద్దరేసి అన్నదమ్ములు నివాసం ఉంటారు. పై అంతస్తులో ఉన్న అన్న కిందికి రావాలంటే.. కింద ఉన్న తమ్ముడు ప్రతీరోజు టపాసులు కాలుస్తుంటాడు. ఇదేమి సంబరాలు అనుకుంటున్నారా. అ వేమీ సంబరాలు కావు. మెట్లపై ఉన్న కోతులను తరిమివేసేందుకు అన్నదమ్ములు పేలుస్తున్న బాణాసంచా బాధ.’
‘సిటీలోని శివారుకాలనీల్లో పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. మురికి కాలువల్లో జలకాలాడుతున్నాయి. మురుగు అంతా రోడ్లపైకి తీసుకొస్తున్నాయి. ఇళ్లలోకి చొరబడుతున్నాయి. అంతేకాదు చెత్త డంపింగ్ ఏరియాల్లో గుంపులుగా తిరుగుతున్నాయి. పందుల కారణంగా దోమలు వృద్ధి చెందుతున్నాయి. ఫలితంగా స్థానికులు రోగాలతో సతమతమవుతున్నారు.’
Comments
Please login to add a commentAdd a comment