‘రాజీవ్ స్వగృహ’లో వసతుల కల్పనపై దృష్టి
● ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
తిమ్మాపూర్: మండలంలోని రామకృష్ణకాలనీలో ఉన్న అంగారిక టౌన్‌న్‌షిప్‌లో వసతులు కల్పిస్తామని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డితో కలిసి టౌన్ షిప్‌లో జరుగుతున్న పనులను శనివారం పరిశీలించారు. రూ.2కోట్లతో చేపట్టిన రోడ్లు, వీధిదీపాలు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం వంటి వసతులపై సమీక్షించారు. భగీరథ పైప్‌లైన్ రోడ్డుమధ్యలో విస్తరించినందున, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ కాలనీలోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా ప్రాంగణాన్ని సందర్శించారు. వివిధ భవనాలు, కుట్టు శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. ప్రాంగణ అభివృద్ధికి గతంలో చేపట్టిన పనుల ప్రగతిపై ఆరా తీశారు. ఆవరణలో పిచ్చిమొక్కలు ఉండటంతో జేసీబీతో తొలగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మినారాయణ గౌడ్, తిమ్మాపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, మాజీ ఎంపీపీ కుంట రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment