జిల్లా జైలును సందర్శించిన డీజీ
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ జిల్లాజైలును జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యామిశ్రా శనివారం జైళ్లశాఖ ఐజీ మురళీబాబు, కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి సందర్శించారు. అగర్‌బత్తుల తయారీ పరిశ్రమను పరిశీలించారు. ఖైదీల యోగక్షేమాలు, భోజన వసతి, న్యాయసేవా గురించి తెలుసుకున్నారు. జైలు క్యాంటీన్, ఆస్పత్రి, ములాఖత్, ఫోన్ సౌకర్యాలు పరిశీలించారు. పెట్రోల్ బంకు పనితీరును పరి శీలించి అధికారులను అభినందించారు. మహిళా జైలును సందర్శించి వసతిపై ఆరా తీశారు. జైలు సూపరింటెండెంట్ శ్రీనివాస్, వైద్యాధికారి వేణుగోపాల్, జైలర్లు పి.శ్రీనివాస్, బి.రమేశ్, యూ.పర్శరాం, డిప్యూటీ జైలర్లు ఏ.శ్రీనివాస్‌రెడ్డి, ఎస్.సుధాకర్‌రెడ్డి, రమేశ్, అజయ్, ఎన్.సంగీత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment