వేములవాడ: స్థానిక రాజరాజేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి నైవేద్యం తయారీలో ఉద్యోగుల నిర్లక్ష్యంపై ఆలయ ఈవో వినోద్‌రెడ్డి సీరియస్ అయ్యారు. మద్యం సేవించి, విధులకు హాజరైన అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవడంతో వంట బ్రాహ్మణుడు సంతోష్‌ను ఆదివారం సస్పెండ్ చేశారు. అలాగే, గతంలో విజిలెన్స్ దాడులు, ఆరోపణలు ఎదుర్కొన్న కాంట్రాక్టు ఉద్యోగి మధుపైనా సస్పెన్షన్ వేటు వేశారు. నైవేద్యశాలలోనే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ను సరెండర్ చేశారు. అక్టోబర్ 13, 2021లో రాజన్న ఆలయంలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో జూనియర్ అసిస్టెంట్ నక్క తిరుపతికి పనిష్‌మెంట్ కింద రూ.85 వేలు చెల్లించాలని ఆదేశించినా ఇప్పటివరకు చెల్లించలేదు. ఆయన ఇటీవల జరిగిన ఆలయ ఉద్యోగుల బదిలీల్లో భాగంగా యాదగిరిగుట్టకు వెళ్లారు. దీంతో సదరు ఉద్యోగి వేతనంలో కోత విధించాలంటూ యాదగిరిగుట్ట ఈవోకు సిఫారసు చేశారు. విషయం తెలుసుకున్న తిరుపతి త్వరలోనే రూ.85 వేలు చెల్లిస్తానని ఇక్కడి అధికారులకు చెప్పినట్లు తెలిసింది.
వంట బ్రాహ్మణుడిని సస్పెండ్ చేసిన రాజన్న ఆలయ ఈవో
కాంట్రాక్ట్ ఉద్యోగి కూడా..
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి సరెండర్
బదిలీ అయిన ఉద్యోగి వేతనంలో కోతకు సిఫారసు
Comments
Please login to add a commentAdd a comment