చౌకబారు ప్రకటనలు అర్థరహితం | - | Sakshi
Sakshi News home page

చౌకబారు ప్రకటనలు అర్థరహితం

Published Thu, Sep 5 2024 2:08 AM | Last Updated on Thu, Sep 5 2024 2:08 AM

చౌకబారు ప్రకటనలు అర్థరహితం

కరీంనగర్‌ అర్బన్‌: ఉద్యోగులు వరద బాధితుల కోసం ఆపన్నహస్తం అందిస్తే లచ్చిరెడ్డి అనే వ్యక్తి జేఏసీ నేతగా, బాధ్యుడిగా తను ఇప్పించినట్లు ప్రకటన చేయడం సత్యదూరమని ఎంప్లాయీస్‌ జేఏసీ చైర్మన్‌ దారం శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు వరద బాధితులకు ఒకరోజు వేతనం విరాళమిస్తే చౌకబారు ప్రకటనలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బుధవారం స్థానిక సంఘ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. లచ్చిరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఉద్యమమంటే పత్రికా ప్రకటనలు కాదని, క్షేత్రస్థాయిలో పోరాటం చేయడమే ఉద్యమానికి నిరూపణని అన్నారు. గత ప్రభుత్వానికి కొమ్ము కాసి, తొత్తుగా వ్యవహరించి నేడు వైఖరి మారినట్టుగా ప్రజలందరిని, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లని తప్పుదోవ పట్టిస్తున్న లచ్చిరెడ్డి వైఖరి సరికాదని పేర్కొన్నారు. గుర్తింపు పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు భాగస్వామిగా ఉన్న జేఏసీ మారం జగదీశ్వర్‌, ఏలూరి శ్రీనివాసరావు నాయకత్వంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల శ్రేయస్సుకు పోరాటం చేస్తుందని వివరించారు. టీఎన్జీవోల సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మణరావు, టీజీవో నేతలు మడిపల్లి కాళీచరణ్‌గౌడ్‌, నాగుల నరసింహస్వామి, రాగి శ్రీనివాస్‌, మహిళా ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ తిరుమల శారద, నాలుగోతరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కోట రామస్వామి, శంకర్‌, ముప్పిడి కిరణ్‌కుమార్‌రెడ్డి, సర్దార్‌ హర్మిందర్‌సింగ్‌, బల్వీర్‌సింగ్‌, రాజేశ్‌ భరద్వాజ్‌, డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంజీత్‌సింగ్‌, డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పెండ్యాల కేశవరెడ్డి, మోసం అంజన్న, దామర మహేందర్‌రెడ్డి, దాసరి లింగయ్య, కర్ణాకర్‌ తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement