దసరా తర్వాత కొత్త టీచర్లు
● నేడు 245 మందికి సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా నియామక పత్రాలు ● హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో కార్యక్రమం ● కలెక్టరేట్ నుంచి ప్రత్యేక బస్సులు
కరీంనగర్: డీఎస్సీ–2024 ద్వారా టీచర్ పోస్టులకు ఎంపికై నవారు బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా హైదరాబాద్‌లో నియామక పత్రాలు అందుకోనున్నారు. కరీంనగర్ జిల్లాలో వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న 245 టీచర్ పోస్టులకు 1ః3 ప్రకారం 735 మందిని ఎంపిక చేశారు. వీరిలో 711 మందికి సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 5వ తేదీ వరకు పూర్తయింది. మిగతావారు పలు కారణాలతో హాజరు కాలేదు.
సెలవుల తర్వాత విధుల్లోకి..
బతుకమ్మ, దసరా సెలవుల తర్వాత ఈ నెల 15న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. నియామక పత్రాలు అందుకునే కొత్త టీచర్లు అప్పుడే విధుల్లో చేరనున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో పని చేస్తున్న చాలా మంది ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందడంతో ఆయాచోట్ల ఉపాధ్యాయులు లేక ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రస్తుతం డీఎస్సీ ద్వారా ఖాళీల భర్తీ జరుగుతుండటంతో జిల్లాలో టీచర్ల కొరత చాలా వరకు తీరనుంది. దీనికితోడు 2008 డీఎస్సీలో ఉద్యోగాలకు అర్హత సాధించి, పలు కారణాలతో నష్టపోయిన వారిని ప్రభుత్వం కాంట్రాక్టు పద్ధతిలో ఎస్జీటీలుగా నియమించే ప్రక్రియ చేపడుతోంది. జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కొత్త గురువులు ఉద్యోగాల్లో చేరితే విద్యావ్యవస్థ గాడినపడే అవకాశాలున్నాయి.
టీచర్ పోస్టుల వివరాలు..
జిల్లాలోని 245 టీచర్ పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్–86, ఎస్జీటీ–114, భాషా పండితులు–18, పీఈటీలు–07, స్పెషల్ ఎడ్యుకేటర్(ఎస్‌ఏ)–05, ఎస్జీటీ 15 ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికై నవారిని బుధవారం హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో జరిగే నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి తరలించేందుకు కలెక్టరేట్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. వీరిలో ది వ్యాంగులు, గర్భిణులు, బాలింతలు ఉన్నట్ల యితే వెంట వచ్చేలా కుటుంబసభ్యుల్లో ఒకరిని అనుమతిస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పీవీ.నర్సింహారెడ్డి డీఈవోలకు ఆదేశాలిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment