మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి
కరీంనగర్ కార్పొరేషన్: మాజీ మంత్రి కేటీఆర్ మహిళలను చిన్నచూపు చూస్తూ అడుగడుగునా కించపరిచేలా మాట్లాడుతున్నారని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న ఆరోపించారు. మహిళలకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్ ట్రోల్ చేయడాన్ని నిరసిస్తూ గురువారం కరీంనగర్‌లోని ఇందిరాచౌక్‌లో రోడ్డుపై బైఠాయించి, ఆందోళన చేపట్టారు. కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదా లు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా మంత్రిపై ట్రోల్ చేయడం దారుణమన్నారు. ట్రోల్ చేసేవారి కుటుంబంలోనూ అక్కాచెల్లెళ్లు ఉంటారన్న కనీస జ్ఞానం లేకుండా పోయిందన్నారు. బీఆర్‌ఎస్‌కు, కేటీఆర్‌కు మొదటి నుంచి మహిళల పట్ల చిన్నచూపేనని మండిపడ్డారు. కేబినెట్‌లో ఒక్క మహిళను కూడా తీసుకోలేదని, కనీసం సీ్త్ర, శిశుసంక్షేమ శాఖను కూడా మహిళకు ఇవ్వని చరిత్ర బీఆర్‌ఎస్‌దని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళా నాయకురాలు సుశీల, కవిత, లావణ్య, రజిత రెడ్డి, హసీనా, సత్య, అంజలి, స్వప్న, పుష్పలత, లత, సుజాత, మంజుల, కవిత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment