5 కిలోల కణితి తొలగింపు
కరీంనగర్ టౌన్: ఓ మహిళ కడుపులో నుంచి 5 కిలోల కణితిని ఆపరేషన్ ద్వారా తొలగించారు కరీంనగర్ ప్రభుత్వాస్పత్రి వైద్యులు. బాధితురాలికి ప్రాణాపాయం తప్పడంతో కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. గోదావరిఖనికి చెందిన నుస్రత్ బేగం కడుపు నొప్పితో బాధపడుతూ గత నెల 31న కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిందని దవాఖానా సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి తెలిపారు. అదేరోజు స్కానింగ్ చేయించి, కడుపులో 30 సెంటీమీటర్ల కణితి ఉన్నట్లు గుర్తించామన్నారు. వెంటనే శస్త్ర చికిత్స చేయాలని లేకపోతే ప్రాణాపాయం ఉంటుందని బాధిత కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు అంగీకరించారన్నారు. నుస్రత్ బేగంకు హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటంతో రక్తం ఎక్కించి, శుక్రవారం ఆపరేషన్ చేశామని చెప్పారు. ఐదు కిలోల కణితిని విజయవంతంగా తొలగించామని పేర్కొన్నారు. ఇదే శస్త్రచికిత్స ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేయిస్తే రూ.2 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. బాధితురాలు ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉందన్నారు. కరీంనగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎలాంటి ఆపరేషన్‌లైనా చేస్తామని, పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బంది, మందులు అందుబాటులో ఉన్నాయని, లాప్రోస్కోపిక్ సర్జరీలు సైతం చేస్తున్నామని పేర్కొన్నారు. పేషెంట్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శస్త్రచికిత్స చేసిన ఓబీజీ హెచ్‌వోడీ డాక్టర్ దీప, అనస్థీషియా హెచ్‌వోడీ డాక్టర్ శంతన్, యూనిట్ చీఫ్ డాక్టర్ నిర్మల, సర్జన్ వైద్య బందం నిక్కత్ పర్వీన్, సంగీత, కుమారస్వామి, పీజీ లావణ్య, అనస్థీషియా టీం శ్రీకాంత్, సతీశ్, రశ్మిత, సిస్టర్ జమున బృందాన్ని వీరారెడ్డి అభినందించారు.
మహిళకు ఆపరేషన్ చేసిన కరీంనగర్ ప్రభుత్వాస్పత్రి వైద్యులు
తప్పిన ప్రాణాపాయం
Comments
Please login to add a commentAdd a comment