ఇద్దరు అధికారులు, అటెండర్‌పై అట్రాసిటీ కేసు
చిగురుమామిడి(హుస్నాబాద్): చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన దళిత, వికలాంగుడైన మాతంగి తిరుపతిపై దాడి చేసినందుకు స్థానిక తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్, అటెండర్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదయింది. ఎస్సై బి.రాజేశ్ తెలిపిన వివరాలు.. బాధితుడు తిరుపతి తన తండ్రి పేరుమీద ఉన్న ఎకరం వ్యవసాయ భూమిని పట్టా చేయాలని కొన్నేళ్లుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఈ విషయమై బాధితుడు గత నెల 24న తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా నాయబ్ తహసీల్దార్ పార్థసారధితో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తిరుపతిపై అదే కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న రాజేందర్ దాడిచేశాడు. అంతటితో ఆగకుండా నాయబ్ తహసీల్దార్, బాధితుడి వీపులో తన్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో గత నెల 26న శ్రీపట్టా చేయమంటే పట్టుకొని కొట్టారు’ శీర్షికన ‘సాక్షిశ్రీలో కథనం ప్రచురితమైంది. బాధితుడు చిగురుమామిడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాగా తిరుపతిపై నాయబ్ తహసీల్దార్, అటెండర్ దాడిచేస్తుండగా ప్రేక్షక పాత్ర పోషించిన తహసీల్దార్ రమేశ్‌పై కూడా అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment