కాళోజీ నారాయణరావుకు నివాళి
కరీంనగర్‌రూరల్: ప్రజాకవి, తెలంగాణ ఉద్యమకారుడు కాళోజీ నారాయణ వర్ధంతి వేడుకలను బుధవారం నగునూరు తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో తెలుగు వి భాగం, జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నారాయణరావు చిత్రపటానికి కళాశాల ప్రిన్సిపాల్ టి.మాలతి పూలమాల వేసి నివాళి అర్పించారు. కాళోజీ నారాయణరావు తెలంగాణాలో అక్షరజ్యోతిని వ్యాపింపజేసిన మహాకవి అ ని, అతను అందించిన కవితా సంపుటి ప్రజల గుండెల్లో చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జి.సమత, అధ్యాపకులు వెంకటేశ్వర్లు, పద్మజ, సురేశ్‌కుమార్, కవిత, గీతారాణి, స్వప్న, విద్యార్థినులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment