గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–1 పరిధిలోని 70 కిలోల కాపర్‌వైర్‌ను సెక్యూరిటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఏరియా సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి ఆదేశాలతో జూనియర్ ఇన్‌స్పెక్టర్లు ఉమేశ్, అక్బర్‌అలీ, ఇంటిలిజెన్స్ టీం రాధాకృష్ణ, తిరుపతితో కలిసి విఠల్‌నగర్‌లో ఓఇంటి వద్ద తనిఖీ చేయగా 70కిలోల కాపర్‌వైర్ లభించింది. ఇది సింగరేణి కంపెనీకి చెందినదిగా నిర్ధారించారు. అక్కడే ఉన్న అనుమానితులను ప్రశ్నించగా ఏరియా వర్క్‌షాప్ నుంచి చోరీ చేసినట్లు తెలిపారు. అనుమానితుల్లో నలుగురు పట్టుబడగా, ఇద్దరు పరారయ్యారు. పట్టుబడిన నిందితుల్లో మహేశ్, సురేశ్, రాజు, రవి ఉన్నారు. వీరితోపాటు కాపర్‌వైర్‌ను వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసినట్లు వివరించారు. పట్టుకున్న కాపర్‌వైర్ విలువ సుమారు రూ.42వేల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment