వాస్తవికతకు ప్రతిబింబం కాల్వ మల్లయ్య రచనలు
కరీంనగర్: సాహిత్యాన్ని సామాజిక వాస్తవికతకు ప్రతిబింబం చేసే విధంగా డాక్టర్ కాల్వ మల్లయ్య రచనలు ఉంటాయని అభ్యుదయ ర చయితల సంఘం జాతీయ కార్యదర్శి వేల్పుల నారాయణ పేర్కొన్నారు. సంఘం జిల్లాశాఖ ఆధ్వర్యంలో భగత్‌నగర్‌లోని భగవతి పాఠశాల ఆవరణలో ఆదివారం డాక్టర్ కాల్వ మల్లయ్య రాసిన మూడు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ‘మంచి అన్నది మాల అయితే’ నవలను వేల్పుల నారాయణ, ‘గంప’ వ్యాసాల పుస్తకాన్ని బుద్ధుల లక్ష్మయ్య, ‘పదహారు గంటల యాదిలో మనః పరిభ్రమణం’ నవలను పీవీ సంతోష్‌బాబు ఆవిష్కరించారు. వేల్పుల నారాయణ మాట్లాడుతూ తాత్విక నేపథ్యంతో అస్తిత్వవాదం మల్లయ్య రచనల్లో అంతఃసూత్రంగా సాగుతుందని పేర్కొన్నారు. పద్యకవి డాక్టర్ బొద్దుల లక్ష్మయ్య మాట్లాడుతూ కాల్వ మల్లయ్య రచనల్లో తాను పుట్టి పెరిగిన నేల పరిమళమే గుబాలిస్తుందని కొని యాడారు. సంఘం ఉమ్మడి జిల్లాశాఖ అధ్యక్షుడు గులాబీల మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ‘మంచి అన్నది మాల అయి తే’.. నవలను కూకట్ల తిరుపతి, ‘తెలంగాణ దేశీ భాషా సాహిత్య వ్యాసాల గంప’ను బూర్ల వెంకటేశ్వర్లు, ‘పదహారు గంటల యాదిలో మనః పరిభ్రమణం’ నవలను సంకేపల్లి నాగేంద్రశర్మ పరిచయం చేశారు. దామరకుంట శంకరయ్య, సందెవేని అమరేందర్, నరేందర్, బా లసాని కొమురయ్య, గాజోజు నాగభూషణం, కందుకూరి అంజయ్య, తరిగొప్పుల కుమారస్వామి, జీగురు రవీందర్ పాల్గొన్నారు.
గోపాలాచార్యకు సర్వేపల్లి రాధాకృష్ణన్ స్ఫూర్తి పురస్కారం
కరీంనగర్: భవానీ సాహిత్యవేదిక నిర్వహించిన నూరవ పుస్తకావిష్కరణ సందర్భంగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన కేవీ.గోపాలాచార్యుల సేవలను గుర్తిస్తూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ స్ఫూర్తి పురస్కారంతో సత్కరించారు. ఆదివా రం కరీంనగర్‌లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో జరిగిన సభలో జాతీయ పురస్కారాలు అందించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కవి రచయిత మౌనశ్రీ మల్లిక్, నటులు, నంది పురస్కార గ్రహీత సాధనాల వెంకటస్వామి నాయుడు చేతులమీదుగా కేవీ.గోపాలాచార్య ఈ సన్మానాన్ని అందుకున్నారు.
బీరప్ప విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం బొమ్మకల్‌లో కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప, మహంకాళి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉత్సవ విగ్రహాల ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. ఒగ్గు పూజారి సాయిల్ల శివయ్య ఆధ్వర్యంలో బీర్ల కళాకారులు డప్పు చప్పుళ్లతో విగ్రహాలను ఆలయం వద్దకు తీసుకెళ్లారు. సాయంత్రం గణపతి పూజ నిర్వహించారు. మాజీ ప్రజాప్రతినిధులు పురుమల్ల లలిత–శ్రీనివాస్ దంపతులతోపాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment