కార్పొరేషన్‌లో కలపొద్దు
● గ్రామాల్లో నిరసనలు ● ప్రజాభిప్రాయం సేకరించాలని వేడుకోలు ● లేకపోతే ఆందోళనలు చేస్తామంటున్న గ్రామీణులు
పునరాలోచన చేయాలి
గ్రామాలను విలీనం చేయడానికి ముందు ప్రజల అభిప్రాయం కోసం గ్రామసభ నిర్వహించాలి. గ్రామీణులపై పన్నుల భారంతోపాటు అభివృద్ధి కుంటుపడే అవకాశాలున్నందున ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఈ విషయమై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించాలి.
– భూక్య తిరుపతినాయక్,
మాజీ వైస్ ఎంపీపీ, కొత్తపల్లి
ప్రజలు రోడ్డున పడతారు
నగరపాలక సంస్థలో గ్రామా ల విలీనం వల్ల ఉపాధిహామీ పథకం కూలీలు ఉపాధి కోల్పోతారు. ఇక్కడి 80 శాతం ప్రజలు పంటల సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. వారందరూ రోడ్డున పడతారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని, విలీనం నిలిపివేయాలి. – కాసారపు శ్రీనివాస్‌గౌడ్,
మాజీ సర్పంచ్, మల్కాపూర్
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ నగరపాలక సంస్థలో శివారు గ్రామాల విలీన ప్రతిపాదనపై వ్యతిరేక త వ్యక్తమవుతోంది. గ్రేటర్ కరీంనగర్‌లో భాగంగా కొత్తపల్లి మున్సిపాలిటీతోపాటు కొత్తపల్లి మండలంలోని మల్కాపూర్, లక్ష్మీపూర్, చింతకుంట, కరీ ంనగర్ రూరల్ మండలంలోని బొమ్మకల్, గోపాల్‌పూర్, దుర్శేడ్ గ్రామాలను విలీనం చేయాలని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీనిపై అసెంబ్లీ వేదికగా చర్చ జరిగినప్పటి నుంచి గ్రామాల్లో ఆందోళనలు మొదలయ్యాయి. విలీన ప్రక్రియను వెన క్కి తీసుకోవాలని గ్రామాలకు చెందిన పలువురు కలెక్టర్‌ను కలిసి విన్నవించారు. సోమవారం చింతకుంట, మంగళవారం మల్కాపూర్ గ్రామాల్లో కా ర్పొరేషన్ వద్దు.. గ్రామాలే ముద్దు అంటూ ప్రధాన రహదారులపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఇప్పటికే నగరపాలక సంస్థలో కలిపిన గ్రా మాల పరిస్థితి అధ్వానంగా ఉందని, కనీసం తాగునీరు ఇవ్వలేని దుస్థితి నెలకొందని, వీధి దీపాలు లేక అనేక కాలనీలు అంధకారంలో ఉంటున్నాయ ని, అంతర్గత రోడ్లు దెబ్బతిన్నాయని చెబుతున్నా రు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సమంజసమని అంటున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి, విలీన ప్రక్రియపై నిర్ణయం తీసుకోవాలని వేడుకుంటున్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోకుంటే రానున్న రోజుల్లో దశలవారీగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment