● జిల్లాలో భక్తిశ్రద్ధలతో క్రిస్మస్
కరీంనగర్ కల్చరల్/కరీంనగర్‌రూరల్: జిల్లాలో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు బుధవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వేకువజామున లేచి, కొత్త దుస్తులు ధరించి, చర్చిలకు వెళ్లారు. చిన్నాపెద్ద తేడా లేకుండా ప్రార్థనలు, ప్రత్యేక గీతాలాపనలు, ప్రభువు నామసర్మణ, క్రీస్తు బైబిల్ పఠనంతో క్రైస్తవ మందిరాలు మారుమోగాయి. అన్ని చర్చిల్లో ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా కేక్‌లు కట్ చేశారు. ఫాదర్స్, పాస్టర్స్ సందేశాన్ని శ్రద్ధగా విన్నారు. కరీంనగర్‌లోని పోలీస్ కమిషనర్ నివాసానికి ఎదురుగా ఉన్న సీఎస్‌ఐ వెస్లీ కేథడ్రల్ చర్చిలో పాస్టరేట్ చైర్మన్ పాల్ కొమ్మాల్ క్రైస్తవులతో ప్రార్థనలు చేయించి, సందేశమిచ్చారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శుభాకాంక్షలు చెప్పి, కేక్ కట్ చేశారు. క్రిస్టియన్ కాలనీ సీఎస్‌ఐ సెంటినరీ వెస్లీ చర్చిలో పాస్టరేట్ చైర్మన్ ఎస్.జాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జ్యోతినగర్‌లోని లూర్దుమాత చర్చి ఫాదర్ సంతోష్‌కుమార్ ప్రత్యేక ప్రార్థనలు చేయించి, సందేశాన్నిచ్చారు.
గుంటూరుపల్లి చర్చిలో..
కరీంనగర్ మండలం గుంటూరుపల్లి చర్చిలో బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పురుమల్ల శ్రీనివాస్ కేక్ కట్ చేసి, క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. చేగుర్తి ఎంపీటీసీ మాజీ సభ్యురాలు స్వరూప, ఇరుకుల్ల మాజీ సర్పంచ్ జువ్వాడి మారుతీరావు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment