‘జాతి గర్వించదగిన నేత వాజ్‌పేయ్’
కరీంనగర్ టౌన్: భారత జాతి గర్వించదగిన నేత మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయ్ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కొనియాడారు. వాజ్‌పేయ్ శతజయంతి, సుపరిపాలన దినోత్సవాన్ని బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళి అర్పించారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రధానిగా వాజ్‌పేయ్ దూర దృష్టి వల్లే నేడు దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందన్నారు. భారత జాతికి శాంతిమంత్రం జపించడమే కాదు.. యుద్ధతంత్రం తెలుసునని నిరూపించిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. అనంతరం బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బాలు ఆధ్వర్యంలో సుష్మారాజ్ చౌరస్తాలో అన్నదానం చేపట్టారు. కార్యక్రమాల్లో నాయకులు కోమల ఆంజనేయులు, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కన్నబోయిన ఓదెలు, సాయిని మల్లేశం, ఎర్రబెల్లి సంపత్‌రావు, బండ సుమ రమణారెడ్డి, కొలగాని శ్రీనివాస్, వైద్య రామానుజం, జానపట్ల స్వామి, ఎడమ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment