కంగ్రాట్స్.. శ్రీవల్లీ
కరీంనగర్ స్పోర్ట్స్: క్రికెట్‌లో రాణిస్తూ జిల్లా కీర్తిని చాటుతున్న క్రికెటర్ కట్ట శ్రీవల్లీకి క్రికెట్ సంఘం జిల్లా అధ్యక్షుడు వి.ఆగంరావు లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ సంతకం చేసిన బ్యాట్‌ను బుధవారం హైదరాబాద్‌లో అందజేశారు. ఆమె జనవరి 4 నుంచి 12 వరకు త్రివేండ్రంలో జరగనున్న అండర్–19 క్రికెట్ వన్డే ట్రోఫీకి తెలంగాణ జట్టులో చోటు దక్కించుకోవడం గర్వకారణమన్నారు. ఇందులో గొప్ప ప్రదర్శన చేసి, తిరిగి రావాలని సూచించారు. క్రికెట్ సంఘం జిల్లా శాఖ నుంచి అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. శ్రీవల్లీ భవిష్యత్‌లో ఇండియా టీంకు ఎంపికవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
త్వరలో తాగునీటి సమస్య పరిష్కారం
● మేయర్ యాదగిరి సునీల్‌రావు
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలక సంస్థలోని విలీన గ్రామాల్లో త్వరలో తాగునీటి సమస్య పరిష్కారమవుతుందని మేయర్ యాదగిరి సునీల్‌రావు తెలిపారు. 21వ డివిజన్‌న్ బాలా జీనగర్‌లో రూ.35 లక్షలతో చేపట్టనున్న తాగునీటి పైప్‌లైన్ అభివృద్ధి పనులకు కార్పొరేటర్ జంగిలి సాగర్‌తో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీతారాంపూర్ ప్రాంతంలోని బాలాజీ నగర్, సూర్యనగర్ కాలనీలకు 1,400 మీటర్ల తాగునీటి పైప్‌లైన్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పనులు పూర్తవగానే సీతారాంపూర్ ప్రాంతంలో తాగునీటి సమస్య ఉండదన్నారు. అంతేకాకుండా, అమృత్ పథకం కింద రూ.147 కోట్లతో చేపట్టిన పనులతో విలీన గ్రామాలున్న డివిజన్లలో తాగునీటి సరఫరాకు 2050 వరకు ఎలాంటి ఇబ్బంది కలగదని చెప్పారు. నగరంలో మాదిరిగానే విలీన గ్రామాలకు కూడా తాగునీరు సరఫరా చేస్తామన్నారు. బాలాజీనగర్‌లో డ్రైనేజీ సమస్య తమ దృష్టికి వచ్చిందని, త్వరలోనే డ్రైనేజీ నిర్మాణం చేపడుతామని హామీ ఇచ్చారు. ఆర్‌అండ్‌బీ శాఖ కల్వర్టులను విస్తరించకపోవడంతో ఏటా వర్షాకాలం వరద రోడ్లపైకి వస్తోందని తెలిపారు. చాలాసార్లు చెప్పినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఆ శాఖ వైఫల్యంతోనే నగరంలోని వీ పార్క్, ఆర్టీసీ వర్క్‌షాప్, రాంనగర్ చౌరస్తా, టాటా హాస్పిటల్ చౌరస్తా, మంచిర్యాల చౌరస్తాల వద్ద వరదనీరు రోడ్లపైకి వస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికై నా కల్వర్టులను విస్తరించాలని సూచించారు.
ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల వంటావార్పు
కరీంనగర్: ఎస్‌ఎస్‌ఏ(సమగ్ర శిక్షా అభియాన్) ఉద్యోగులు బుధవారం వంటావార్పుతో నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట దీక్షా శిబిరంలోనే వంట చేసి, సహపంక్తి భోజనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 100 రోజుల్లో సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని ఇచ్చిన హామీని సీఎం రేవంత్‌రెడ్డి నిలబెట్టుకోవాలన్నారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు బెజ్జంకి ఆంజనేయులు, అధ్యక్షుడు గుండా రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి మహేశ్, ఉపాధ్యక్షులు రమేశ్, రవిచంద్ర, కేజీబీవీ ప్రత్యేక అధికారులు రమాదేవి, పూర్ణిమ గౌతమి, మాధవి, కిరణ్ జ్యోతి, సునీత, కవిత, భార్గవి పాల్గొన్నారు.
కొనసాగుతున్న ధనుర్మాసోత్సవాలు
కరీంనగర్ కల్చరల్: కరీంనగర్‌లోని యజ్ఞవరాహ క్షేత్రంలో ధనుర్మాసోత్సవాలు కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం సుప్రభాతం, కొలువు, తోమాల సేవ నిర్వహించారు. గోదా అష్టోత్తర శతనామార్చన, సేవా కాలం, నివేదన, మంగళ శాసనం, పాశుర విన్నపం, తీర్థప్రసాదం, గోపాలకృష్ణమాచార్యచే ప్రవచనాలు, సుదర్శనేష్టి హోమం వైభవంగా జరిగా యి. విష్ణుసహస్రనామ పారాయణం చేశారు. సర్వ వైదిక సంస్థానం ట్రస్ట్ ఉపకులపతి వరప్రసాద్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment