భక్తజన మల్లన్న జాతర
గొల్లపల్లి: మండలంలోని మల్లన్నపేట మల్లికార్జునస్వామి జాతర ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఒగ్గు కళాకారుల ఢమరుక వాయిద్యాల మధ్య పట్నాలు వేశారు. బెల్లం (బంగారం) తో తూకం వేశారు. అర్చకులు కొల్లూరి రాజేందర్, రఘునందన్ ఆధ్వర్యంలో పూజలు చేశారు. పోలీసు బృందాలు బందోబస్తు చేపట్టాయి. టికెట్ల ద్వారా రూ.72వేల ఆదాయం సమకూరినట్లు ఫౌండర్ ట్రస్టీ శాంతయ్య, నిర్వహణ అధికారి విక్రమ్ తెలిపారు. ఏఎంసీ చైర్మన్ బీమ సంతోష్, మాజీ సర్పంచ్ సిద్ధంకి నర్సయ్య, మాజీ ఎంపీటీసీ గోస్కుల రాజన్న, విద్యాకమిటీ చైర్మన్ సిద్దంకి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment