సమాజస్థాపనలో భాగస్వామ్యం కావాలి
కొత్తపల్లి(కరీంనగర్): స్ఫూర్తి కుటుంబం– తెలంగాణ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంకమ్మతోట లోని ఆర్యవైశ్య భవన్‌లో శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి మానవాళికి అందించిన సుమారు 40 పదుల జ్ఞానభండాగారంపై ‘ఇన్నోవేట్ ది ఇన్నర్ సెల్ఫ్’ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ప్రాక్టికల్ ఫిలాసఫీ, సీ్త్ర సవ్యసాచి, ఆత్మ పరిశీలన, రిలీజియస్ హ్యుమానిటీ అనే అంశాలపై సభికులు మాట్లాడారు. ఈఎన్‌టీ సర్జన్, స్పెషలిస్ట్ రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నేటి సమాజంలో మానవత్వం పెంపొందించాలని శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి వారి ఆధ్యాత్మిక శక్తితో నిస్వార్థ సేవ చేస్తున్నారని పేర్కొన్నారు. ట్రస్ట్ ఆథర్ రమణి, మేనేజింగ్ ట్రస్టీ ఆళ్ల రాజేశ్, ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ బి.వెంకటేశ్వర్లు, రిటైర్డ్ స్కిన్ స్పెషలిస్ట్ విమల, డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ రామారావు మాట్లాడారు. అసిస్టెంట్ డివిజన్ ఇంజినీర్ ఈ ఎల్‌పీ రాజు, శివ, సవార్కర్, శ్రీలత ఉన్నారు.
పురస్కారానికి ఆహ్వానం
కరీంనగర్: సాహితీ గౌతమి ఏటా ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న సినారె కవితా పురస్కారం–2022కు ఇరు రాష్ట్రాల నుంచి వచన కవితా సంపుటులను ఆహ్వానిస్తున్నట్లు పురస్కార కమిటీ కన్వీనర్ డాక్టర్ ఎడవెల్లి విజయేంద్రరెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నంది శ్రీనివాస్, కొత్త అనిల్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కవులు 2019,20,21 సంవత్సరాలలో ముద్రించబడిన వారి కవితా సంపుటులను ఈ పోటీ కోసం 4ప్రతులు ఈనెల 25లోగా పంపించాలన్నారు. కేవలం వచన కవితా సంపుటులను మాత్రమే పంపించాలన్నారు. వివరాలకు 9490401861, 9395553393 నంబర్‌లో సంప్రదించవచ్చునని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment