ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
జమ్మికుంట: ప్రజాసమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం కొనసాగిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉపాధి, నిరుద్యోగ భృతి కేటాయించాలన్నారు. రైతుభరోసా, డబుల్ బెడ్‌రూం ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మతం, దేశభక్తి పేరుతో బీజేపీ చేస్తున్న విభజన రాజకీయ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆందోళన, పోరాటాలు చేస్తుంటే అణిచివేస్తూ, రైతు, కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చా రు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు శీలం అశోక్, కొప్పుల శంకర్, నాయకులు సమ్మయ్యతోపాటు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment