గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి
జగిత్యాలక్రైం: జగిత్యాల స్పెష ల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న క్యాతం మల్లేశం (42) అనే వ్యక్తి శ్వాస ఇబ్బందులు తలెత్తడంతో ఆస్పత్రికి తరలించగా చి కిత్స పొందుతూ మృతిచెందా డు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేటకు చెందిన మల్లేశంపై 13 రోజుల క్రితం మల్యాల పోలీస్‌స్టేషన్‌లో ఓ మహిళ చీటింగ్ కేసు పెట్టగా పోలీసులు అరెస్ట్ చేసి జగి త్యాల స్పెషల్ జైలుకు తరలించారు. గురువారం రా త్రి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతోందని జైలు అధికారులకు తెలపడంతో వెంటనే హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందాడు. జుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ జితేందర్, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ ఆస్పత్రికి చేరుకుని కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలం రికార్డు చేశారు. మల్లేశం మృతితో ఆ కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధించారు. జైలర్ మొగిలేశ్ మృతుడి భార్య లతతో ఫిర్యాదు తీసుకుని పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతునికి కుమారుడు అర్జున్, కుమార్తె స్వాతి ఉన్నారు. విచారణలో మల్యాల సీఐ నీలం రవి, పట్టణ సీఐ వేణుగోపాల్ పాల్గొన్నారు.
రామన్నపేటలో విషాదం
మల్యాల: మహిళను వివాహం చేసుకుంటానని మోసం చేసిన కేసులో రిమాండు ఖైదీగా ఉన్న మల్యాల మండలం రామన్నపేటకు చెందిన క్యాతం మల్లేశం జైలులో మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మల్లేశం తనను రేప్ చేశాడని, వివాహం చేసుకుంటానని మోసం చేశాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయింది. అతడిని ఈ నెల 4న రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రవి తెలిపారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.
విచారణ చేపట్టిన న్యాయమూర్తి, ఆర్డీవో
Comments
Please login to add a commentAdd a comment