పెండింగ్ డీఏ చెల్లించాలి
కరీంనగర్: పెండింగ్ డీఏ విడుదల చేసి పీఆర్‌సీ అమలు చేయాలని డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.రాజిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అవాల నరహరి అధ్యక్షతన సమావేశం జరిగింది. రాజిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని కోరారు. ఆడిట్ కమిటీ కన్వీనర్ ఈశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ గురుకుల పాఠశాలల విద్యార్థులకు అందించే మెనూ మండల పరిషత్, జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టా లని, స్నాక్స్ అందజేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు ఆవాల నరహరి మాట్లాడుతూ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి తూముల తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షుడు కానుగంటి రాజమౌళి పాల్గొన్నారు.
డయల్ యువర్ ఆర్‌ఎంకు స్పందన
విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ డయల్ యువర్ రీజినల్ మేనేజర్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 14 మంది ప్రయాణికులు పలు సమస్యలపై ఫిర్యాదు చేశారు. వాటిని నోట్ చేసుకున్న ఆర్‌ఎం బి.రాజు పరిష్కారాని కి డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు.
క్వింటాల్ పత్తి రూ.7,100
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌లో క్వింటాల్ పత్తి ధర గరిష్టంగా రూ.7,100 పలికింది. శుక్రవారం మార్కెట్‌కు 15వాహనాల్లో 136 క్వింటాళ్ల పత్తిని రైతులు అ మ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.7,000, కనిష్ట ధర రూ.6,600కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. శని, ఆదివారాలు యార్డుకు సెలవు ఉంటుందని, సోమవారం యథావిధిగా కొనుగోళ్లు సాగుతాయని కార్యదర్శులు మల్లేశం, రాజా వివరించారు.
ఎట్‌హోమ్‌లో సుడా చైర్మన్
కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన ఎట్‌హోమ్‌లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది సందర్భంగా సికింద్రాబాద్‌లో బస చేయడం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన ఎట్‌హోమ్ కార్యక్రమానికి నరేందర్‌రెడ్డి హాజరయ్యారు.
పారదర్శకంగా పార్క్ టెండర్
కరీంనగర్ అర్బన్: ఉజ్వల పార్క్ టెండర్ ప్రక్రియ పారదర్శఽకంగా నిర్వహించామని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లీజు వ్యవధి పూర్తవగా లీజు కోసం సెప్టెంబర్ 21 నుంచి 27వరకు సీల్డ్ టెండర్‌ను పిలిచామన్నారు. రెండేళ్ల లీజు కాలానికి పార్క్ నిర్వహణ, కార్యకలపాలకు సమర్థులైన కంపెనీలను పిలవగా ఆరు కంపెనీలు టెండర్‌లో పాల్గొన్నాయని వెల్లడించారు. అక్టోబర్ 1న టెండర్లు తెరవగా అత్యధిక బిడ్ శ్రీ లక్ష్మి నర్సింహ గ్రానైట్స్, కరీంనగర్ రూ.26,01,000కు వేయగా నెలకు రూ.2,16,750 కు కోట్ చేశారని వివరించారు. గతంలో టూరిజం కార్పొరేషన్ నెలకు రూ.50వేలు లీజు కింద ఇచ్చేదని పేర్కొన్నారు. టెండర్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, న్యాయబద్ధంగా జరిగిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment