వెన్కెపల్లి యువకుడి అదృశ్యం
● సైబర్ నేరగాళ్లను నమ్మి, రూ.8.50 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు సమాచారం
సైదాపూర్: సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మిన ఓ యువకుడు వారు చెప్పిన ఖాతాకు రూ.8.50 లక్షలు పంపించినట్లు సమాచారం. తర్వాత అతను అదృశ్యమయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సైదాపూర్ మండలంలోని వెన్కెపల్లికి చెందిన కామారపు శ్రీకాంత్ స్థానిక విశాల సహకార సంఘంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఇతను సైబర్ నేరగాళ్ల మాయలో చిక్కుకున్నాడు. రూ.5 లక్షలు చెల్లిస్తే, మూడు నెలలకే ఆ డబ్బుకు రూ.30 వేలు కలిపి ఇస్తామని, రూ.15 లక్షలు చెల్లిస్తే రూ.40 లక్షలు ఇస్తామని ఆశ చూపారు. నిరుపేద కుటుంబం కావడంతో తమ పేదరికం పోతుందని శ్రీకాంత్ భావించాడు. బంధువులు, స్నేహితులు, తనకు తెలిసినవారి వద్ద రూ.లక్షల్లో అప్పులు చేసినట్లు సమాచారం. ఈ నెల 17న సైదాపూర్ కేడీసీసీ బ్యాంకు నుంచి తన అకౌంట్ నంబర్ 202722010060000 ద్వారా ఎస్‌బీఐ గోరక్‌పూర్ బ్రాంచి, జ్యోతిదేవి అకౌంట్ నంబర్ 38080484767కు రూ.8.50 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు తెలిసింది. గురువారం ఉదయం 11 గంటలకు బైక్‌పై వెళ్లిన శ్రీకాంత్ తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అతని తల్లి బుచ్చవ్వ శుక్రవారం ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment