భూకబ్జా కేసులో బీఆర్‌ఎస్ నాయకుల రిమాండ్
సిరిసిల్ల క్రైం: ప్రభుత్వ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్న బీఆర్‌ఎస్ నాయకులను సిరి సిల్ల పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలి ంచారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు అగ్గి రా ములు, తంగళ్లపల్లి స్టేషన్ పరిధిలో జిందం దేవదాసుపై కేసు నమోదైంది. అధికారులను మచ్చిక చేసుకొని, అసైన్డ్ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వారిపై అభియోగాలున్నాయి. భూమి అనుభవదారుగా మార్చిన అప్పటి అధికారులపై కేసు నమోదు చేశామని, వారు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
పింఛన్ ఇప్పిస్తానని నగలు కాజేశాడు..
కోరుట్ల: ఓ వృద్ధురాలికి పింఛన్ ఇప్పిస్తానని నమ్మించిన దుండగుడు ఆమె నగలు కాజేశాడు. బాధితురాలి వివరాల ప్రకారం.. కథలా పూర్ మండలం దుంపెటకు చెందిన దొప్పల చిన్న గంగు శుక్రవారం పని నిమిత్తం కోరుట్లకు వచ్చింది. స్థానిక నంది చౌరస్తా వద్ద ఉండగా ఆమె వద్దకు ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి, నీకు పింఛన్ ఇప్పిస్తామని చెప్పాడు. మెడలో నగలు తీస్తే ఫొటో తీసుకుంటానన్నాడు. అతని మాటలు నమ్మిన చిన్న గంగు మెడలోని తులం బంగారు గొలుసుతోపాటు పావు తులం చెవికమ్మలు తీసి, ఇచ్చింది. వాటిని తీసుకున్న దుండగుడు వెంటనే అక్కడినుంచి పరారయ్యాడు. బాధి తురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
అనారోగ్యంతో కళాకారుడి మృతి
వీర్నపల్లి(సిరిసిల్ల): అడవిపది రకు చెందిన మాట్ల బాబు (47) అనే కళాకారుడు అనా రోగ్యంతో మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. బాబు తన కళాప్రదర్శనల ద్వారా ఎన్నో తెలంగాణ, బహుజన సాంస్కృతిక వేదికల మీద, ఎలక్షన్ క్యాంపెయిన్‌లలో ప్రదర్శనలు ఇచ్చాడు. ఓవైపు పేదరికం వెంటాడుతున్నా డప్పే తన ఆయుధంగా ప్రజల్లో చైతన్యానికి కృషి చేశాడు. ఆయన అనారోగ్యానికి గురై, పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నాడు. నయం కాకపోవడంతో గురువారం రాత్రి ఇంట్లోనే మృతిచెందాడు. మృతుడికి భార్య మంజుల, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బీఎస్పీ మండల అధ్యక్షుడు గజ్జెల ప్రశాంత్, స్థానికులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment