చోరీ కేసులో ఆరుగురి అరెస్టు
జగిత్యాల క్రైం: ఓ ఇంట్లో చొరబడి, దంపతులను డమ్మీ తుపాకులతో బెదిరించి, దొంగతనం చేసిన కేసులో ఆరుగురిని అరెస్టు చేశామని, ఒకరు పరారీలో ఉన్నట్లు జగిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. శుక్రవారం జగిత్యాలలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. బీర్‌పూర్ మండల కేంద్రానికి చెందిన కాసం ఈశ్వరయ్య ఇంట్లో ఈ నెల 14 తెల్లవారుజామున దుండగులు చొరబడ్డారు. దంపతులను బంధించి, డమ్మీ తుపాకులతో బెదిరించి, 10 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేలు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలించారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్, రూరల్ సీఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నాలుగు పోలీసు బృందాలు నిందితుల కోసం గాలింపు చేపట్టాయి. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి, నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం మున్యాలకు చెందిన మున్నేశుల శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా లక్షెట్‌పేట్ మండలం గోపవాడకు చెందిన పొన్నూరు హైస్కూల్ రికార్డు అసిస్టెంట్ చిప్పబత్తుల తులసయ్య, జగిత్యాల రూరల్ మండలం గుట్రాజ్‌పల్లికి చెందిన బక్కెనపల్లి అరుణ్, బీర్‌పూర్ మండల కేంద్రానికి చెందిన యశోద శ్రీనివాస్, జగిత్యాల రూరల్ మండలం అనంతారా నికి చెందిన సైదు సహదేవ్, మంచిర్యాల జిల్లా జ న్నారం మండలం మర్రిమడుగుకు చెందిన రత్నం మాణిక్యంలను శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 10 తులాల ఆభరణాలు, రూ.10 వేలు, 6 ఫోన్లు, ఒక ద్విచక్రవాహనం, రెండు డమ్మీ తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మంచిర్యాల జిల్లా పోచమ్మవాడకు చెందిన ముకునూరి కిరణ్‌కుమార్ పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. డీఎస్పీ రఘుచందర్, రూరల్ సీఐ కృష్ణారెడ్డి, బీర్‌పూర్ ఎస్సై కుమారస్వామి, రూరల్ ఎస్సై సదాకర్, బుగ్గారం ఎస్సై శ్రీధర్‌రెడ్డి, సారంగాపూర్ ఎస్సై దత్తాద్రి, హెడ్‌కానిస్టేబుల్ గంగాధర్, కానిస్టేబుళ్లు గంగాధర్, శ్రీనివాస్, వెంకటేశ్, ముత్తయ్య, సుమ న్, రవి, రమేశ్‌నాయక్, లింగారెడ్డి, శివ, పరమేశ్, జలంధర్‌లకు రివార్డులిచ్చి, అభినందించారు.
పరారీలో మరొకరు
ఆభరణాలు, రూ.10 వేలు, 6 ఫోన్లు, 2 డమ్మీ తుపాకులు, బైక్ స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment