ఆడుకుంటూ వెళ్లి.. తప్పిపోయిన పాప
వేములవాడ: ఆడుకుంటూ రోడ్డుపైకి వచ్చి, తప్పిపోయిన ఓ పాపను కుటుంబసభ్యులకు అప్పగించినట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. కొడిమ్యాలకు చెందిన రమేశ్–రమ్య దంపతులు వేములవాడలోని తమ బంధువుల ఇంట్లో పెళ్లి ఉంటే ఈ నెల 19న పాపను తీసుకొని, వెళ్లారు. రాత్రి బంధువుల ఇంట్లోనే ఉన్నారు. శుక్రవారం వేకువజామున వివాహానికి హాజరయ్యేందుకు ఫంక్షన్‌హాల్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో పాప ఆడుకుంటూ రోడ్డుపైకి వచ్చింది. అలాగే చాలా దూరం వెళ్లింది. కాసేపటికి చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికారు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ప్రభు అనే యువకుడు తప్పిపోయి, ఏడ్చుకుంటూ వెళ్తున్న పాపను ఎత్తుకొని, స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. పోలీసులు ఆ చిన్నారి తల్లిదండ్రులను పిలిపించి, అప్పగించారు. పాపను జాగ్రత్తగా ఠాణాకు తీసుకొచ్చిన ప్రభును సీఐ వీరప్రసాద్ అభినందించారు. రమేశ్–రమ్య దంపతులు అతనితోపాటు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment