మైనర్ డ్రైవింగ్‌పై స్పెషల్ ఫోకస్
సిరిసిల్ల క్రైం: పిల్లలకు బైక్‌లు ఇచ్చి, షాప్‌కు వెళ్లమనడం, బంధువులను తీసుకురావాలని చెప్పడం, వెనకాల కూర్చొని, వారితో డ్రైవింగ్ చేయించడం ప్రమాదకరమని రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లాలో మైనర్లు వాహనాలు నడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నందున నాలుగు రోజులుగా మైనర్ డ్రైవింగ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. దీంతో ఊహించని స్థాయిలో దాదాపు 350 మంది మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు పెద్దలు కారణమని పలువురిని కౌన్సిలింగ్ చేసిన ప్పుడు తెలిసిందన్నారు. వారికి సిరిసిల్ల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించామని తెలిపారు. పిల్లలు డ్రైవింగ్ చేసి, ప్రమాదాలకు కారణమైతే కేసులపాలవుతారన్నారు. వారికి వాహనాలు ఇవ్వడం మానుకోవాలని సూచించారు. ప్రస్తుతం పట్టుబడినవారి వివరాలను వెంటనే ఆన్‌లైన్ చేయాలని, మళ్లీ బైక్‌లు నడుపుతూ పట్టుబడితే కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఒకసారి ఎఫ్‌ఐఆర్ నమోదైతే ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లాలంటే పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఉండదన్నారు. అందుకే నిర్ణీత వయస్సు వచ్చే వరకు వాహనాలు నడపొద్దని సూచించారు.
రాజన్నసిరిసిల్ల జిల్లా
ఎస్పీ అఖిల్ మహాజన్
బైక్‌లు నడుపుతూ పట్టుబడిన
దాదాపు 350 మందికి కౌన్సెలింగ్
ఇకనుంచి ఇవ్వను
నేనే మా అబ్బాయిని బైక్ తీసుకెళ్లమని చెప్పాను. ప్రమాదాలు జరుగుతున్న తీరును పోలీసు సార్లు చెప్పిన తర్వాత ఇక బైక్ ఇవ్వొద్దని నిర్ణయించుకున్నాను. ఇప్పటినుంచి ఏదైనా పని ఉంటే నేనే వెళ్తాను.
– లింగపల్లి రాజేశం, సుందరయ్యనగర్, సిరిసిల్ల
Comments
Please login to add a commentAdd a comment