వేర్వేరు చోట్ల ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్
జగిత్యాలక్రైం: జగిత్యాల మీదుగా వేర్వేరు చోట్ల నుంచి గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శనివారం వివరాలు వెల్లడించారు. పట్టణ శివారులోని రాజీవ్‌గాంధీ చౌరస్తా వద్ద పట్టణ ఎస్సై గీత ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా.. శివాజీనగర్‌కు చెందిన కల్యాణం ఉదయ్ ద్విచక్రవాహనంపై గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు. అతని నుంచి కిలో గంజాయి, ద్విచక్రవాహనం, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఉదయ్ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాడవి జనక్‌రావు వద్ద కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు. అలాగే పట్టణ ఎస్సై మన్మథరావు ఆధ్వర్యంలో తహసీల్ చౌరస్తా వద్ద తనిఖీలు చేపడుతుండగా.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం పిప్పిరి గ్రామానికి చెందిన మాడవి జనక్‌రావు పట్టుబడ్డాడని పేర్కొన్నారు. ఆయన నుంచి కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ వేణుగోపాల్, ఎస్సైలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment