ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలంలో పలు దొంగతనాలకు పాల్పడ్డ వ్యక్తిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై రమాకాంత్ వివరాల ప్రకారం.. రాచర్లగొల్లప ల్లికి చెందిన ధారంగుల గంగయ్య మండల కేంద్రానికి చెందిన మిరియాల్‌కర్ శ్రీనివాస్ అనే వ్యక్తికి సంబంధించిన కారులోని ఆమ్ల్పిఫైర్‌ను ఆగస్టు 21 న రాత్రి, అంతకుముందు జగిత్యాల జిల్లా కొడిమ్యాల గ్రామానికి చెందిన భక్తుల రాములు అదే నెలలో 20న గొల్లపల్లి వడ్డెరకాలనీలో ఆటో నిలిపి ఉంచగా అందులోని ఆమ్ల్పిఫైర్‌ను ఎత్తుకెళ్లాడు. వెంకటాపూర్‌లో అక్టోబర్ 10న రాత్రి మరాఠి లచ్చవ్వ ఇంటికి తాళం వేసి ఉండగా.. గంగయ్య తాళాలు ప గలకొట్టి లోనికి ప్రవేశించి ఇంట్లోని బంగారం, వెండి మొలతాడు, వెండి బ్రాస్‌లెట్ అపహరించాడు. ఈ మూడు దొంగతనాలు గంగయ్య చేసినట్లు నిర్ధారణ కావడంతో అరెస్ట్ చేసి రెండు ఆమ్ల్పిఫైర్లు, 1,200 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment