ఇద్దరు యువకుల రిమాండ్
ధర్మపురి: వారం రోజుల క్రితం నేరెల్ల గుట్టల్లో ఒక యువకున్ని దారుణంగా హత్య చేసి కాల్చి చంపిన ఇద్దరు యువకులను ఆదివారం రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. నేరెల్లకు చెందిన గోపాల్, కమలాపూర్‌కు చెందిన గండికోట శేఖర్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాహుల్ సూర్యప్రకాశ్‌సింగ్‌ను వారం క్రితం ముంబాయి నుంచి కారులో నేరెల్లకు తీసుకొచ్చారు. ఆ రాత్రి ఓ చోట దాచి మరుసటి రోజు ఈనెల 13న అర్ధరాత్రి నేరెల్ల సాంబశివ దేవాలయం వద్దకు తీసుకెళ్లారు. రాహుల్ సూర్యప్రకాశ్ తలపై గోపాల్ బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. అక్కడి నుంచి శవాన్ని 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సారంగాపూర్ మండలం బట్టపెల్లి, పోతారం వెళ్లే రహదారి గుండా అడవి ప్రాంతానికి తీసుకెళ్లారు. కట్టెల్లో పెట్రోలు పోసి మృతదేహాన్ని దహనం చేసిన విషయం తెలిసిందే.
ఫొరెన్సిక్ నిపుణులతో శవ పరీక్ష
సంఘటనా స్థలానికి ఆదివారం డీఎస్పీ రఘుచందర్‌తోపాటు సీఐ రాంనర్సింహరెడ్డి, ఎస్సైలు ఉదయ్‌కుమార్, శ్రీధర్‌రెడ్డి చేరుకున్నారు. అనంతరం పోలీసుల సమక్షంలో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రి ఫొరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శవ పరీక్ష నిర్వహించారు. దర్యాప్తులో భాగంగా నిందితులైన గోపాల్(నేరెల్ల), గండికోట శేఖర్(కమలాపూర్)ను అరెస్టు చేసి ఆదివారం రిమాండుకు పంపినట్లు డీఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment