25న పేదింటి యువతి వివాహం
● దాతల సాయం కోసం ఎదురుచూపులు
ఎలిగేడు(పెద్దపల్లి): ఓ పేదింటి యువతి వివాహం ఈనెల 25న నిశ్చయం కాగా.. చేతిలో చిల్లి గవ్వ లేక దాతల సాయం కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తోంది. ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన చీకటి లక్ష్మి–కీ.శే.రామస్వామిల చిన్న కూతురు ప్రత్యూష వివాహం నరసింహులపల్లి గ్రామానికి చెందిన బుర్ర సతీశ్‌తో ఈనెల 25న బుధవారం జరగనుంది. ప్రత్యూష తండ్రి రామస్వామి పేగు క్యాన్సర్‌తో పదేళ్ల క్రితం మృతిచెందగా.. తల్లి లక్ష్మికి మతిస్థిమితం సరిగా లేదు. అన్న, వదినలు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెద్ద కూతురు పెళ్లికి చేసిన అప్పులు తీరలేదు. వీరి కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకొని ప్రత్యూషను పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చిన పెళ్లి కుమారుడు ఆదర్శంగా నిలిచాడు. ఐతే పెళ్లికి కనీసం పుస్తెలు, మట్టెలు, పెళ్లి కానుకలు, ఖర్చులకు చిల్లి గవ్వ లేక ఆ కుటుంబం దాతలు సాయం చేయాలని వేడుకుంటున్నారు.
అప్పుల బాధతో వృద్ధుడి బలవన్మరణం
ముస్తాబాద్(సిరిసిల్ల): అప్పుల బాధతో మద్యానికి బానిసైన వృద్ధుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై గణేశ్ వివరాల ప్రకారం.. ముస్తాబాద్ మండలం మద్దికుంటకు చెందిన సంపంగి ఎల్లయ్య (63) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆదివారం ఉరేసుకున్నాడు. ఎల్లయ్య తన ముగ్గురు కూతుళ్ల పెళ్లిలను అప్పులు చేసి చేశాడు. రూ.10లక్షల వరకు అప్పులుండగా.. కూలి పనులు చేసుకునే తాను ఎలా తీర్చేదంటూ ఎల్లయ్య ఆవేదనకు గురయ్యాడు. ఈక్రమంలోనే మద్యానికి బానిసయ్యా డు. అప్పులు తీరే మార్గం కనిపించక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు సంపత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు.
ఫోన్‌పే నంబర్లు
9963942486(శ్రావణ్),
9866430173(ప్రత్యూష)
Comments
Please login to add a commentAdd a comment