సిరిసిల్లటౌన్: టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై వెళ్తున్న నేత కార్మికుడిని ట్రావెలర్ వాహనం ఢీకొట్టగా.. అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణంలోని బీవైనగర్‌కు చెందిన గాజుల సత్యనారాయణ(50) నేత కార్మికుడు. భార్య అరుణ బీడీలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో సత్యనారాయణ సిరిసిల్ల కొత్త బస్టాండ్ సమీపంలోని ఓ సెలూన్‌కు వెళ్లి తన టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై ఇంటికి వస్తున్నాడు. అదే సమయంలో సిరిసిల్ల నుంచి పెద్దూరు వెళ్తున్న ట్రావెలర్ వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ట్రావెలర్ కింద చిక్కుకొని అక్కడికక్కడే మరణించగా.. డ్రైవర్ వేణు పారిపోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. మృతుడికి కూతురు లావణ్య, కొడుకు వంశీ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment