విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం పొలా స గ్రామంలో ఆదివారం ఉదయం విద్యుదాఘాతంతో ఎడెల్లి మారుతి అనే వ్యక్తి నివాసముండే ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. మారుతి కుటుంబ సభ్యులు ఆదివారం మల్లన్నపేట దేవాలయంలో బోనాలు సమర్పించేందుకు ఇంటికి తాళం వేసి వెళ్లారు. ఇంట్లో మంటలు చెలరేగి రూ.2.50లక్షల నగదు, 8 తులాల బంగారం, విలువైన డాక్యుమెంట్లు, బీరు వాలో ఉన్న విలువైన వస్తువులతోపాటు బియ్యం బస్తాలు, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. స్థాని కులు అగ్నిమాపక శాఖ అధికారికి సమాచారమంది ంచగా.. ఫైరింజన్ ద్వారా ఇతర ఇళ్లకు మంటలు వా ్యపించకుండా 2 గంటలపాటు శ్రమించి మంటలార్పారు. ఇల్లు దగ్ధం కావడంతో కుటుంబ సభ్యులకు నిలువ నీడ లేకుండా పోయింది. కట్టు బట్టలు, తి నుబండారాలు కూడా దగ్ధమవడంతో తీవ్రంగా రో దించారు. అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణకాంత్, ఫైర్‌మెన్ శ్రీనివాస్, రవీందర్, సుధాకర్, గణేశ్ శ్ర మించి మంటలార్పారు. సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ సదాకర్ పరిశీలించి పంచనామా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment