వినూత్న సాగుకు దక్కిన గౌరవం
సారంగాపూర్(జగిత్యాల): పెంబట్ల గ్రామానికి చెందిన బండారి వెంకటేశ్–విజయ ఆదర్శ రైతు దంపతులకు ఆదివారం అరుదైన గౌరవం లభించింది. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో జాతీయ గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు(2024) నిర్వహించారు. ఈ సదస్సులో పెంబట్ల గ్రామానికి చెందిన బండారి వెంకటేశ్–విజయ రైతు దంపతులు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఆధునిక వ్యవసాయ సాగు విధానాలను అనుసరిస్తూ పంటలను సాగు చేస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రలకు చెందిన 130 రైతు దంపతులను రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐయిలయ్య తదితరులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్–విజయలను సన్మానించారు. వెంకటేశ్–విజయ తాము చేస్తున్న వ్యవసాయాన్ని సదస్సులో వివరించారు.
మార్కెట్‌కనుగుణంగా పంటల సాగు
మార్కెట్‌లో ఏ పంటకు డిమాండ్ ఉంటే ఆ పంటను ఎంచుకొని సాగు చేయడం వెంకటేశ్–విజయ దంపతులు పది సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు. ఇతడికి ఉన్న ఐదెకరాల్లో కేవలం రెండెకరాల్లో వరి పంట సాగు అతి స్వల్పం. సాగు చేసిన వరి పంటను నేరుగా వినియోగదారులకు బియ్యం నూర్పిడి చేయించి అమ్ముతుంటారు. సేంద్రియ విధానంలో పంటల సాగుకు వీరు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. వివిధ రకాల కూరగాయలు డ్రిప్ విధానం, మల్చింగ్ సిస్టంలో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం యాసంగిలో వరి పంటకు బదులు పుచ్చకాయ నాలుగెకరాలు, బెండ 20 గుంటలు, 20 గుంటలు వంకాయ సాగు చేశారు. పుచ్చకాయలో మూడు రకాల పంటలను సాగు చేస్తూ గత సంవత్సరం ప్రముఖ రిలయన్స్ వంటి స్టోర్ కంపెనీల మాల్‌లకు సరఫరా చేశారు. పంటల సాగును అక్కడ వివరించారు. వెంకటేశ్ భార్యకు గాజులు, చీర, ఆడబిడ్డకు అందజేసే లాంఛనాలు అందించారు. దంపతులకు ప్రశంసాపత్రం అందించి శాలువాతో సత్కరించారు.
పెంబట్ల రైతు దంపతులకు యాదగిరిగుట్టలో సన్మానం
జాతీయ గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సులో మంత్రులతో సత్కారం
వ్యవసాయంలో మార్కెట్‌కనుగుణంగా పంటల సాగు
Comments
Please login to add a commentAdd a comment