ద్విచక్ర వాహనం దొంగల అరెస్ట్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనం చోరీకి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులను ఆదివారం పో లీసులు అరెస్ట్ చేసి రిమా ండ్‌కు తరలించారు. ఎస్సై రమాకాంత్ వివ రాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన దాస రి అజయ్‌కుమార్ అనే వ్యక్తి తన పల్సర్ ద్విచక్ర వాహనాన్ని ఈనెల 17న రాచర్లగొల్లపల్లి బస్టాండ్ వద్ద నిలిపాడు. ఈ వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. అజయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. స్థానిక రెండో బైపాస్ రోడ్డులో కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలానికి చెందిన ముద్రకోల శ్రీకాంత్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంతో అనుమానాస్పదంగా కనిపించడంతో పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. కామారెడ్డి పట్టణానికి చెందిన టాక్ అర్జున్‌సింగ్ అనే వ్యక్తి తన వద్ద వాహనం అమ్మకం కోసం పెట్టాడని తెలిపాడు. శ్రీకాంత్‌తోపాటు అర్జున్‌సింగ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వివరించారు.
ద్విచక్ర వాహనం అపహరణ
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ వైన్స్ వద్ద నిలిపిన ద్విచక్ర వాహనాన్ని శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి తన ఫ్యాషన్ ప్రో వాహనం(నంబర్ ఏపీ15ఏవీ5720) వైన్స్ పక్కన రాత్రి నిలపగా.. మరుసటి రోజు వచ్చి చూసేసరికి కనిపించలేదు. బాధితుడు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment