ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్ విజేత కరీంనగర్
కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్ కొత్తపల్లిలోని అకాడమిక్ హైట్స్‌లో ఆదివారం జరిగిన ఉమ్మడి కరీంనగర్ హ్యాండ్‌బాల్ జిల్లాస్థాయి సీఎం కప్–2024 జూనియర్ విజేతలుగా కరీంనగర్ జిల్లా జట్లు నిలిచాయి. పురుషులు, మహిళల విభాగంలో రన్నర్‌గా రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లా జట్లు నిలిచాయి. సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, డీవైఎస్‌వో శ్రీనివాస్‌గౌడ్ హాజరై ట్రోఫీలను అందజేశారు. ఒలింపిక్ సంఘం కార్యవర్గ సభ్యుడు సిలివేరి మహేందర్, ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం కార్యదర్శి బసరవేణి లక్ష్మణ్, కరీంనగర్, పెద్దపెల్లి జిల్లా పెటా సంఘాల అధ్యక్షులు శ్రీనివాస్, వేల్పుల సురేందర్, జిట్టబోయిన శ్రీనివాస్, వెంకటేశ్, అశోక్, ప్రేమ్, మణి తదితరులు పాల్గొన్నారు.
నేడు జిల్లా సీనియర్స్ జూడో జట్ల ఎంపిక పోటీలు
కరీంనగర్‌స్పోర్ట్స్: జిల్లా జూడో సంఘం ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ మంకమ్మతోటలోని సాయి మానేరు పాఠశాలలో జిల్లాస్థాయి సీనియర్స్ జూడో మహిళలు, పురుషుల జట్ల ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా జూడో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కడారి అనంతరెడ్డి, గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి తెలిపారు. 2010 లోపు జన్మించిన వారు అర్హులన్నారు. మహిళలకు 48, 52, 57, 63, 70, 78 కిలోల లోపు, 78 కిలోలకు పైగా, పురుషులకు 60, 66, 73, 81, 90, 100 కిలోల లోపు, 100 కిలోల పైవిభాగంలో పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా జట్లకు ఎంపికై న క్రీడాకారులను ఈనెల 25, 26ల్లో హైదరాబాద్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 2 గంటలకు పాఠశాలలో రిపోర్టు చేయాలని, పూర్తి వివరాలకు 9949830494 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
మెట్‌పల్లిరూరల్(కోరుట్ల): వన్యప్రాణుల వేట కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ ఉచ్చు తగిలి ఒకరు మృతిచెందినట్లు మెట్‌పల్లి సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. మెట్‌పల్లి మండలం రాజేశ్వర్‌రావుపేట గ్రామానికి చెందిన జంగిటి నవీన్(32), జంగిటి చిన్ననర్సయ్య శనివారం రాత్రి సమయంలో గ్రామ శివారులో వన్యప్రాణుల వేటకు వెళ్లారు. అంతకుముందే వన్యప్రాణుల వేట కోసం చిన్ననర్సయ్య విద్యుత్ ఉచ్చును ఏర్పాటు చేశాడు. ఈ విషయం తెలియని నవీన్ రాత్రి సమయంలో ఉచ్చు ఉన్న చోటుకు వెళ్లాడు. దీంతో విద్యుదాఘాతానికి గురై నవీన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం ఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. ఉచ్చు ఏర్పాటు చేసిన చిన్ననర్సయ్యపై చర్యలు తీసుకోవాలని మృతుడి భార్య రజిత ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిన్ననర్సయ్యపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment