రంగుల చిత్రాలు వేసి నిరసన
కరీంనగర్: ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె మంగళవారం 22రోజు కొనసాగింది. రంగులతో సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటం, ఎస్‌ఎస్‌ఏలోని విభాగాలను చిత్రాలుగా వేసి వినూత్న నిరసన తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు చాలీచాలని వేతనంతో అత్యంత దుర్భర పరిస్థితులలో జీవనం సాగిస్తున్నారని, వారిని రెగ్యులర్ చేయాలని కోరారు. జిల్లా గౌరవాధ్యక్షుడు బెజ్జంకి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షుడు గుండా రాజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు రమేశ్, రవిచంద్ర, శ్రీనివాస్, భరత్ పాల్గొన్నారు.
రాములోరి సన్నిధిలో జడ్జి
ఇల్లందకుంట: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి వారిని మంగళవారం హుజూరాబాద్ అడిషనల్ మెజిస్ట్రేట్–1 పద్మసాయిశ్రీ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారరు. వారికి ఆలయ అర్చకులు స్వామివారి మెమొంటో బహుకరించి, శాలువాతో ఘనంగా సత్కరించారు.
క్వింటాల్ పత్తి రూ.7,000
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కె ట్లో క్వింటాల్ పత్తి ధర గరిష్టంగా రూ.7,000 పలికింది. మంగళవారం మార్కెట్‌కు 16 వాహనాల్లో 120 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.6,900, కని ష్ట ధర రూ.6,700కు ప్రైవేటు వ్యాపారులు కొ నుగోలు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం మార్కెట్ యార్డుకు సెలవు ఉంటుందని గురువారం యథావివిధిగా కొనుగోళ్లు ప్రారంభం అవుతాయని కార్యదర్శి మల్లేశం పేర్కొన్నారు.
కొత్త ఏడాది అభివృద్ధిలో సుడా పాత్ర కీలకం
కరీంనగర్ కార్పొరేషన్: నూతన సంవత్సరంలో చేపట్టబోయే అభివృద్ధిలో సుడా పాత్ర కీలకం కా నుందని శాతవాహన అ ర్బన్ డెవలెప్‌మెంట్ అ థారిటీ(సుడా) చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి తెలిపారు. మాస్టర్ ప్లాన్ ను కొత్త ఏడాదిలో అమలు పరుస్తామని పేర్కొన్నారు. నగరంలోని అంతర్గత రోడ్ల అభివృద్ధికి నిధులు వెచ్చిస్తామని, గ్రామాల్లో సీసీ రోడ్లు, మురికి కాలువలతో పాటు అవసరమైన చోట రోడ్లను సుందరీకరించి హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. రామకృష్ణాకాలనీలోని అంగాకరక టౌన్‌షిప్ పనులు కొనసాగుతున్నాయని, టౌన్‌షిప్‌లో పూర్తిస్థాయిలో వసతులు కల్పిస్తామన్నారు. జిల్లా ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.
విద్యుత్ ఉద్యోగుల రిఫీజ్ వర్క్
కొత్తపల్లి: కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌సంస్థలను ప్రైవేటీకరించే దిశగా అడుగులు వేస్తున్న సందర్భంలో రాష్ట్ర విద్యుత్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు విద్యుత్ ఉద్యోగుల ఫ్రీజ్ వర్క్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మధ్యాహ్న భోజన సమయంలో కరీంనగర్‌లోని విద్యుత్ భవన్ ప్రాంగణంలో నిరసన చేపట్టారు. విద్యుత్‌శాఖ నాయకులు మాట్లాడుతూ గత మూడేళ్లుగా కేంద్ర, బీజేపీ పాలిత రాష్ట్రాలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే ఆలోచనను విద్యుత్ ఉద్యోగులు అడ్డుకునేందుకు సిద్ధం కావాలన్నారు. ప్రైవేటీకరణతో ఉద్యోగులే కాకుండా సబ్సిడీ రూపంలో లాభం పొందుతున్న బడుగు,బలహీన వర్గాలు, రైతులు, చిన్న పరిశ్రమలు ఇబ్బందులకు గురికాక తప్పదన్నారు. నాయకులు కె.అంజయ్య, నాయిని అంజయ్య, శ్రీనివాస్, సంపత్ కుమార్, జి శ్రీనివాస్, రమేష్, వెంకట్ నారాయణ, ఆర్ శ్రీనివాస్, రాందాస్, రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment