ఆకట్టుకున్న త్యాగరాజ ఉత్సవాలు
వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయం త్యాగరాజ ఆరాధనోత్సవాలతో పులకించిపోయింది. ఆదివారం వివిధ కళలు, కళాకారులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. స్వామి వారి ఓపెన్‌స్లాబ్‌లో ఉదయం నుంచి రాత్రి వరకు కళాకారులు ఉత్సాహం నింపారు. భక్తులు, స్థానికులు పరవశించిపోయారు. లక్ష్మినారాయణ, వేదవతి హరికథలు, తిరుమల లత,
పెండ్యాల భార్గవ బృందం సంగీత కచేరీలు, దుర్గ మైత్రేయి బృందం వీణ సోలో కచేరి,
డి.వర్షిణి బృందం శాసీ్త్రయ సంగీత కచేరి, డీఎస్‌ఆర్.మూర్తి లయ విన్యాసం, లక్ష్మినర్సింహా నాట్య మండలి సతీసావిత్ర పౌరాణిక నాటకం అమితంగా ఆకట్టుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment