క్రీడల్లో నైపుణ్యం పెంచుకోవాలి
హుజూరాబాద్: యువత క్రీడల్లో నైపుణ్యం పెంపొందించుకోవాలని హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ గందె రాధిక అన్నారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సబ్ జూనియర్ బాలబాలికల ఎంపిక పోటీలు జరిగాయి. 18 బాలుర జట్లు, 8 బాలికల జట్లు పోటీల్లో తలపడ్డాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్రీడలు క్రమశిక్షణను పెంచుతాయని పేర్కొన్నారు. జిల్లాస్థాయి సబ్ జూనియర్ బాలబాలికల పోటీల్లో విజేతగా నిలిచినవారు త్వరలో వికారాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు మోటం రవీందర్ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, హాకీ క్లబ్ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, హాకీ క్లబ్ శాశ్వత అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, నీరటి రమేశ్, సందీప్‌రెడ్డి, తాళ్లపల్లి రమేశ్‌గౌడ్, ముత్యం రాజు, గందె శ్రీనివాస్, దామోదర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment