రోడ్డెక్కిన సాగునీరు
శంకరపట్నం(మానకొండూర్): మండలంలోని కేశవపట్నం గ్రామంలో ఆదివారం రోడ్డుపై కాకతీయకాలువ నీరు ప్రవహించింది. అంబాల్‌పూర్, వంకాయగూడెం, కేశవపట్నం గ్రామాల పరిధిలో వ్యవసాయ భూముల పారకం కోసం ఎల్‌ఎండీ నీటిని డీబీఎం–12 నుంచి ఉపకాలువలకు విడుదల చేశారు. కొంతమంది రైతులు చివరి ఆయకట్టుకు నీరు చేరాలని రాత్రివేళ ఉపకాలువకు ఎక్కువనీటిని వదలడంతో కేశవపట్నం బీసీ కాలనీ ఎద్దుగడ్డ వద్ద రోడ్డుపైకి, ఇళ్ల ఆవరణలోకి చేరింది. రైతులు నీటిని పొదుపుగా వాడుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment