స్పెషల్‌ టీమ్స్‌ | - | Sakshi
Sakshi News home page

స్పెషల్‌ టీమ్స్‌

Published Mon, Jan 20 2025 12:24 AM | Last Updated on Mon, Jan 20 2025 12:24 AM

-

● తమ డివిజన్‌లలో సీ ట్యాక్స్‌ వసూళ్లకు కొంతమంది కార్పొరేటర్లు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకున్నారు. తమ సన్నిహితులను ఇందుకు పురమాయిస్తున్నారు.

● మరికొంత మంది కార్పొరేటర్లు తమ కుటుంబసభ్యులకే ఈ వసూళ్ల బాధ్యతను అప్పగించారు.

● ఉదయం లేచింది మొదలు సదరు టీమ్స్‌ డివిజన్‌లో తిరుగుతూ, ఎక్కడ భవన నిర్మాణాలు ఉంటే అక్కడికి వెళ్లి, ఇరుగుపొరుగు ఫిర్యాదులు చేశారని చెబుతూ కార్పొరేటర్‌లను కలవాలంటూ చెప్పి వస్తుంటారు.

● అప్పటికి సదరు యజమానులు రాకపోతే, తమతో మంచి సంబంధాలున్న పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బందిని అక్కడికి పంపించి పనులు నిలిపివేస్తుంటారు.

● తమకు డబ్బులు ముడితేనే, ఆ పనిని సాఫీగా సాగనిస్తారు. లేదంటే ఏదో వంక మీద వేధిస్తూనే ఉంటారు.

● ఈ దందాకు కొంతమంది పట్టణ ప్రణాళిక విభాగం ఉద్యోగులు వత్తాసు పలుకుతుండడంతో సీ ట్యాక్స్‌ వ్యవహారం నగరంలో జోరుగా సాగుతోంది.

● అలాంటి ఉద్యోగులను నగరపాలకసంస్థ ఉన్నతాధికారులు నియంత్రించాల్సి ఉన్నా, ఆ దిశగా చర్యలు కనిపించడం లేదు.

● ఏదేమైనా పదవీ కాలం ముగియనున్న తరుణంలో వసూళ్ల దందాను వేగవంతం చేసిన కొంతమంది కార్పొరేటర్ల వ్యవహారం ప్రస్తుతం నగరంలో హాట్‌టాపిక్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement