బీ–థర్మల్ మూతపడి ఏడు నెలలు
రామగుండం: నగరంలోని బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం ఏడునెలల క్రితం (2024 జూన్ 6న) మూతపడింది. విద్యుత్ ఉత్పత్తిలో ఏడాదిపాటు అనేక ఆటుపోట్లు, తరచూ సాంకేతిక సమస్యలు ఎదుర్కొంది. కాలం చెల్లిన విద్యుత్ కేంద్రం కావడంతో విడి పరికరాల లభ్యత కూడా కష్టతరంగా మారింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కేంద్రాన్ని మూసివేశారు. దాని స్థానంలో నూతన విద్యుత్ కేంద్రం నిర్మించేందుకు ప్రభుత్వం సింగరేణి, జెన్‌కోతో సంప్రదింపులు చేస్తోంది. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ ఠాకూర్ ఇందు కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆధునిక సాంకేతికతపై ఉద్యోగులకు శిక్షణ
థర్మల్ కేంద్రం మూతపడిన నేపథ్యంలో ఖాళీగా ఉన్న ఉద్యోగులకు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో మారుతున్న సాంకేతికతపై బృందాల వారీగా శిక్షణ ఇస్తున్నారు. 12రోజుల పాటు కొత్తగూడెంలోని ఉద్యోగుల శిక్షణ కేంద్రానికి తరలించి బాయిలర్, టర్బయిన్, జనరేటర్, యాష్‌హ్యాండ్లీంగ్, సివిల్ తదితర అంశాల్లో ఇంజినీర్లు అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు బీ–థర్మల్‌లో ఓఅండ్‌ఎం, ఆపరేషన్, జనరేషన్, అడ్మినిస్ట్రేషన్ తదితర విభాగాల ఉద్యోగులు సుమారు 180 మందిని ఇతర విద్యుత్ కేంద్రాలకు బదిలీ చేయకుండా స్థానికంగా కొనసాగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే కేంద్రాన్ని జూన్ 6న మూసివేయగా.. అప్పటికే ఆర్థిక సంవత్సరం పూర్తికావడంతో ఉద్యోగుల బదిలీలకు బ్రేక్ పడినట్లు సమాచారం.
ఏటూ తేలని నూతన విద్యుత్ కేంద్రం
విడతల వారీగా విద్యుత్ ఉద్యోగులకు శిక్షణ
ఆదేశాలు రాలేదు
ఉద్యోగుల బదిలీ మా పరిధిలో ఉండదు. నూతన విద్యుత్ కేంద్రం స్థాపనకు డీపీఆర్ తయారీకి ఓ ఏజెన్సీ నిపుణుల బృందం స్థలం, ఇతరత్రా అంశాలను పరిశీలించి వెళ్లింది. విద్యుత్ కేంద్రం స్థలాల పరిరక్షణకు ప్రహరీ నిర్మాణానికి రూ.9 కోట్లతో టెండర్లు పిలువనున్నాం. ఆధునిక సాంకేతికతపై ఉద్యోగులకు శిక్షణ ఇప్పిస్తున్నాం.
– పి.విజేందర్, బీ–థర్మల్ సూపరింటెండెంట్ ఇంజినీర్
Comments
Please login to add a commentAdd a comment