ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు
● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ● నారాయణపూర్ పంపు వద్ద గోదావరి జలాలకు స్వాగతం
గంగాధర(చొప్పదండి): చొప్పదండి నియోజకవర్గంలోని రైతులు ప్రతిపక్షాల మాటలు నమ్మి ఆందోళనకు గురికావొద్దని, చివరి మడివరకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భరోసా ఇచ్చారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులతో కలిసి నారాయణపూర్ పంపు వద్ద గోదావరి జలాలకు ఎమ్మెల్యే సత్యం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఏనాడు పంటలకు నీరు త్వరగా విడుదల చేయించలేదని అన్నారు. రైతులతో దురుసుగా ప్రవర్తించిన చరిత్ర బీఆర్‌ఎస్ నాయకులదని పేర్కొన్నారు. ప్రాజెక్టు వద్ద కరెంటు సమస్య ఉన్నా అధికారులతో మాట్లాడి నీటిని విడుదల చేయించామని వివరించారు. చొప్పదండి నియోజకవర్గంలో సాగుచేసిన పంటలు ఎండిపోకుండా చూస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడి నారాయణపూర్ రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయిస్తామని పేర్కొన్నారు. ఈసందర్భంగా రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోకుండా సకాలంలో నీటిని విడుదల చేయించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరు మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment