శరవేగంగా రైలు పట్టాల మార్పిడి | - | Sakshi
Sakshi News home page

శరవేగంగా రైలు పట్టాల మార్పిడి

Published Mon, Jan 20 2025 12:25 AM | Last Updated on Mon, Jan 20 2025 12:25 AM

శరవేగంగా  రైలు పట్టాల మార్పిడి

శరవేగంగా రైలు పట్టాల మార్పిడి

ఓదెల(పెద్దపల్లి): దక్షిణ మధ్య రైల్వేలోని కాజీపేట – బల్హార్షా మధ్య రైల్వేట్రాక్‌ మరమ్మతును అధికారులు శరవేగంగా కొనసాగిస్తున్నారు. వందేభారత్‌, స్పెషల్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేగం తట్టుకునేందుకు వీలుగా ప్రస్తుతం పాత పట్టాలు తొలగిస్తూ వాటిస్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రక్రియ కాజీపేట నుంచి జమ్మికుంట, పొత్కపల్లి, ఓదెల, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి వరకు ఇరువైపులా వేగంగా సాగుతోంది. ఈ పనులకు రైల్వేసిబ్బంది సరిపోవడంలేదు. దీంతో కొలనూర్‌, ఓదెల, పొత్కపల్లి, రాఘవాపూర్‌, పెద్దంపేట గ్రామాల నుంచి వందల సంఖ్యలో రోజూవారి కూలీలను వినియోగిస్తున్నారు. ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement