పోలీసులకు సేవా పతకాలు
కరీంనగర్‌క్రైం: జిల్లాకు చెందిన పలువురు పోలీసులకు సేవాపతకాలు దక్కాయి. కరీంనగర్ స్పెషల్ బ్రాంచి ఏఎస్సై బి.మధురిమ, మానకొండూర్ హెడ్‌కానిస్టేబుల్ వి.శ్రీనివాస్, కరీంనగర్ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన ఏఎస్సై రాంమోహన్, హెడ్‌కానిస్టేబుల్ గంగాధర్‌లకు ఉత్తమ సేవాపతకాలను రాష్ట్ర హోంశాఖ మంగళవారం ప్రకటించింది. కరీంనగర్ పీటీసీలో పనిచేస్తున్న డీఎస్పీలు ఆర్. శ్రీనివాస్, సీహెచ్ మల్లిఖార్జున్, ఏఆర్ ఎస్సై యు.సంపత్‌కు, సీఏఆర్ విభాగం ఏఆర్‌ఎస్సై పి.రాంప్రసాద్, కొత్తపల్లి హెడ్‌కానిస్టేబుల్ టి.జగన్మోహనచారి, కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ ఎన్.రాజేందర్, త్రీటౌన్ కానిస్టేబుల్ జి.విజయ ప్రభాకర్, సీఐడీ విభాగానికి చెందిన కానిస్టేబుల్ కె.శ్రీనివాస్‌కు పతకాలు దక్కాయి. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ వీవీ రమణమూర్తికి ఉత్తమ సేవాపతకం వరించింది. విజిలెన్స్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ డి.అశోక్, ఫైర్ విభాగానికి చెందిన కరీంనగర్, చొప్పదండి లీడింగ్ ఫైర్‌మెన్‌లకు పతకాలు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment